ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా చంద్రగిరి లో జరిగిన ఒక దారుణమైన సంఘ్తన ఇప్పుడు వైరల్ గా మారింది. చంద్రగిరి చెందిన మణికంఠ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాలలోకి వెళితే చంద్రగిరి చెందిన మణికంఠకు అతని భార్య భార్గవికి కొంతకాలం క్రితం నుండి విభేదాలు నడుస్తున్నాయి. తన భార్య ఇతన్ని కాదని భాషా అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండడంతో మనోవేధనతో ఉన్నాడు మణికంఠ. పైగా ఈ వ్యవహారానికి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో పని చేసే కానిస్టేబుల్ శ్రీనివాసు కూడా సహకరించాడు అని తెలుసుకున్న మణికంఠ, కేసు పెట్టమని అడగగా నీ మీదే దొంగ కేసు పెట్టి లోపల వేస్తానని వేదిరించాడు.. దీనితో మనస్థాపం చెందిన మణికంఠ ఇక బ్రతికి ఉపయోగం లేదనుకుని పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్ ముందే నిప్పంటించుకున్నాడు.
ఇప్పుడు అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తోంది.ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన కానిస్టేబుల్ శ్రీనివాస్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.