స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కడియం శ్రీహరికి మద్దతుగా ప్రసంగించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని మాణిక్యపురం అనే గ్రామంలో చుక్క సత్తయ్య అనే పేరుమోసిన ఒగ్గు కళాకారుడు ఉండే. నీళ్లు పడకపోతే 58 బోర్లు వేసిండు ఆయన పాపం. ఆ బోర్లు వేసుడు ఎంత బాధ.
ఒకడు కొబ్బరికాయ, ఒకడు తాళపుచెవిల గుత్తి, ఒకడు తంగేడు పుల్ల పట్టుకొని వస్తడు. ఎన్నికల రకాల బాధలు చూశాం. అవస్థలు పడ్డాం. మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలితే బాధ అయింది. చుక్క సత్తయ్య తన ఒగ్గు కథల మీద వచ్చిన పైసలన్నీ ఆ బోరు పొక్కల్లోనే పోశారు. 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదు. ఇది చుక్క సత్తయ్య కథ. ఇంత ఘోరం ఉండే స్టేషన్ ఘన్‌పూర్‌లో. ఎక్కడ నీళ్లు లేకుండే. దేవాదుల కాడ పనులు జరగకపోతే ఇదేం స్కీం రా నాయనా అని పోయి పిండం పెట్టి వచ్చిండు ఎమ్మెల్యే రాజయ్య. పిండం పెట్టి ఆనాడు ప్రభుత్వాన్ని నిలదీశాడు. మీరు బేకార్ గాళ్లు అని మండిపడ్డారని కేసీఆర్ తెలిపారు.