షాకింగ్: దీపావళి సినిమాల్లో ఎక్కువ ప్లాపేనా..!!

-

ఈసారి దీపావళి కి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో మంచు విష్ణు జిన్నా, కార్తీ సర్దార్, శివకార్తికేయన్ ‘ప్రిన్స్’,విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా సినిమాలు వున్నాయి. వాస్తవానికి ఈ సినిమాలలో ఏది తీసి పారవేయదగ్గ సినిమాలు కావు.కాని వీటి వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ముందుగా జిన్నా సినిమాను తీసుకుంటే,కలెక్షన్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.41 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరో వైపు విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘ఓరి దేవుడా..!’ సినిమా కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి.ఈ సినిమా నాలుగు రోజుల్లో  సినిమా షేర్ రూ.3.82 కోట్లుగా ఉంది. ఈ సినిమా ప్రాఫిట్ టార్గెట్ రూ.6 కోట్లు. ఇంకా రూ.2.18 కోట్లు వసూలైతే తప్ప విశ్వక్ సేన్ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ కాదు.

శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ సినిమా పరిస్థితి కూడా దారుణంగా వుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో రూ.2.37 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను అందుకోవడానికి ఇంకా రూ.4.63 కోట్ల షేర్ వసూలు చేయాలి. కాబట్టి ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా లలో  కార్తి  ‘సర్దార్’ పై పరిస్థితి కొంచం మెరుగ్గా ఉంది.. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాలుగు రోజుల్లో రూ.4.80 కోట్ల షేర్ వసూలు చేసింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్కు రావాల్సిన వసూళ్ళు రూ.5.50 కోట్లు. అంటే, ఇంకో రూ.70 లక్షలు వసూలు చేస్తే సేఫ్ ప్రాజెక్ట్ అయ్యి లాభాల్లోకి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఒక్కటే లాభాలు తెచ్చుకొనే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news