ఝూఠా మాటల కేసీఆర్… ఇదిగో నీ పచ్చి అబద్దాల చిట్టా : బండి సంజయ్‌

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బీజేపీ రాష్ట్రశాఖ ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లను రూపొందించింది. ఝూఠా మాటల కేసీఆర్… ఇదిగో నీ పచ్చి అబద్దాల చిట్టా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్‌కుమార్‌ ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లను మంగళవారం నాడు మర్రిగూడలోని క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డిలతో కలిసి రిలీజ్ చేశారు. మనుగోడు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ మరోసారి పచ్చి అబద్దాలు, మోసాలు, తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసేందకు సిద్ధమయ్యారన్నారు. మందు, మాంసం, మనీతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు మునుగోడు ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఝూఠా మాటలు పోస్టర్లను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తదితర సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు.

How long will you live in fear, Bandi Sanjay Kumar questions people

‘కేసీఆర్ ఝూఠా మాటలు మచ్చుకు కొన్ని…..

ఒక దళిత నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తా. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటా గానీ, ఆ మాట తప్పను. ఖచ్చితంగా, ఎట్టిపరిస్థితుల్లో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటారు… దళితులకు మూడెకరాల భూమి ఇస్తా … 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మిస్తా …ప్రతీ మండలంలో అంబేద్కర్‌ వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం… బంగారుతెలంగాణలో రైతు ఆత్మహత్యలుండవు… రైతులు పండిరచిన ఆఖరి గింజవరకు మేమే కొంటాం … తెలంగాణలోని ప్రతీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మనవి చేస్తా ఉన్నాను…. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ రూ.3,016 ల నిరుద్యోగభృతి అందిస్తా… ప్రతీ సంవత్సరం ఎస్‌పిఎస్‌సి ద్వారా ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తాం.. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తా … నియోజకవర్గానికో పాలిటెక్నిక్‌ కాలేజీ కట్టిస్తా… కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య తప్పకుండా అమలు చేస్తా … విద్యార్థులకు సకాలంలో ఫీజురీయాంబర్స్‌మెంట్‌ అందిస్తాం … యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకొస్తా … పోడుభూముల సమస్య పరిష్కారానికి నేనే వస్తా … తెలంగాణలో ప్రతీ లంబాడీ తాండాలో, ప్రతీ గోండు గూడెంలో, ఊరికి దూరంగా ఉండే బస్తీల్లో, ప్రతీ ఇంటికి ప్రభుత్వఖర్చుతో నల్లా పెట్టించి, మంచినీళ్ల తెచ్చి.. ఆ మంచి నీళ్లతోనే మీ పాదాలు కడుగుతా, కడిగినంకనే ఓట్లు అడుగుతా … తెలంగాణ ఉద్యమకారులకే రాజకీయ అవకాశాలు కల్పిస్తా… తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు భూమి, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు, కుటుంబానికో ఉద్యోగంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం … ట్యాంక్‌బండ్‌ అమరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తా … ఇయ్యాల్నే ఉస్మానియా హాస్పిటల్‌ ను చూసొచ్చినా … ఎప్పుడు కూలిపోతాయో తెల్వని ఆ పాతభవనాలను చూస్తే బాధనిపించింది. అక్కడ వున్న డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు, విద్యార్థుల ప్రాణాలను కాపాడటానికి ఆసుపత్రిని కొన్నిరోజుల్లో షిఫ్ట్‌ చేస్తున్నాం.ఆ ప్లేస్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తాం… ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్‌స్పెషాల్టీ హాస్పిటల్‌ కట్టిస్తా. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి కట్టిస్తా … తెలంగాణ ఏర్పడినంక అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఉండవు … కానీ జరుగుతున్నదేమిటి..? హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేసి ఖాళీ చేద్దాం మంచినీటితో నింపేద్దాం… నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తా’ అని బండి సంజయ్‌ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news