ఆర్ఆర్ఆర్ : మెగాస్టార్ పై రాజ‌మౌళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ?

-

ఇండస్ట్రీ పెద్ద గురించి దర్శక ధీరుడు రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి ఇండస్ట్రీ పెద్ద అని అనడం ఇష్టం ఉండడని.. కానీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం ఆయనే ఇండస్ట్రీ పెద్ద అనేది ప్రూవ్ అయిందంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారితో సమావేశం తరువాత సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాజమౌళి ఈవ్యాఖ్యలు చేశారు.

పెద్ద సినిమా, చిన్న సినిమా, నిర్మాతలు, ఎగ్జిబిషన్ కష్టాల గురించి సీఎం జగన్ కు ఉన్న అవగాహనపై ఆశ్చర్చపోయామన్నారు. ఆరుఏడు నెలలుగా ముందుకు వెళ్లాలా.. వెనక్కి వెళ్లాలా అనే పరిస్థితిలో చిరంజీవిగారు ముందు నిలబడి.. సీఎంగారితో ఆయనకున్న చొరవతో ఇంత పెద్ద సమస్యలను పరిష్కరించారని అన్నారు. అందరం ప్రయత్నించినా చిరంజీవి సమస్యను పరిష్కరించారని రాజమౌళి అన్నారు. ఇదంతా మొదలుపెట్టిన మంత్రి పేర్ని నానికి థాంక్స్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news