షాకింగ్: ఎమ్మెల్యే ను కొట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ యాదవ్ !

-

తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికరమైన మలుపులను తీసుకుంటున్నాయి. వరుసగా మూడవ సారి కేసీఆర్ గెలిచి హ్యట్రిక్ సీఎం గా నిలిచి రికార్డు సాధించాలి తహతహలాడుతున్నారు. కానీ ఇవేమీ జరిగేలా బీజేపీ మరియు కాంగ్రెస్ లు చేసేలా లేవు. తాజాగా ఒకే పార్టీకి చెందిన ఒక మంత్రి మరియు ఒక ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండలంలో ఒక శంకుస్థాపన చేయడానికి వెళ్లడం జరిగింది. ఆ సమయంలోనే ప్రజలు మొత్తం తమ చుట్టూ ఉండగానే మంత్రి చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే… మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడే ఉన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను అంతమంది చూస్తుండగానే తలపై కొట్టాడు. ఈ ఊహించని సంఘటనకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటుగా ప్రజలు కూడా షాక్ అయ్యారు.

ఈ సంఘటన గురించి ప్రస్తుతం అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు… కనీసం ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా ఇవ్వకుండా అంతమంది లో కొట్టడం ఏమిటంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు పై కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎర్రబెల్లి అంజయ్యను కొట్టడం వెనుక ఇంకేమైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version