షాకింగ్ న్యూస్: టీ20 లకు రోహిత్ శర్మ దూరం…!

-

వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ఆస్ట్రేలియా పై ఓటమి చెందడంతో ఎంతగానో అభిమానులు మరియు ప్లేయర్స్ నిరాశకు గురయ్యారు. ఇంకా ఈ గాయం నుండి తేరుకోవడం కష్టంగానే ఉందని చెప్పాలి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీం ఇండియా ను వరల్డ్ కప్ లో ఆడిన పదకొండు మ్యాచ్ లలో పదింట్లో గెలిపించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తులో టీ 20 లు ఆడబోడని అంటున్నారు. గతంలో ఒకానొక సమయంలో వరల్డ్ కప్ మీద పూర్తి దృష్టిని కేంద్రీకరించడానికి టీ 20 లకు దూరంగా ఉంటానని రోహిత్ శర్మ సెలెక్టర్ లకు చెప్పాడు. కానీ ప్రస్తుతం టీ20 లలో ఉన్న గిల్, జైస్వాల్, ఇషాన్ మరియు గైక్వాడ్ లాంటి యువ ఆటగాళ్లు ఫెయిల్ అయితే అప్పుడు సెలెక్టర్లు రోహిత్ ను టీ20 లు ఆడమని అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త బయటకు రావడంతో రెండు సంవత్సరాల్లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ ఆడుతాడా లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news