TS కాంగ్రెస్ నేత వివేక్ ఆస్తులపై రైడ్స్… ఈడీ ప్రకటన!

-

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం కావడం వలన గెలుస్తుంది అన్న అవకాశం ఉందన్న కాంగ్రెస్ పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుల పేరుతో సాధించే ప్రయత్నంలో ఉందని TS కాంగ్రెస్ నేతలు కామెంట్ లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ నేత జి వివేక్ కు సంబంధించిన ఇల్లు మరియు ఆఫీస్ లలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన రిపోర్ట్ డీటెయిల్స్ ను కాసేపటి క్రితమే బయటపెట్టింది ఈడీ. వీరు తెలుపుతున్న ప్రకారం 8 కోట్లకు సంబంధించిన ఒక లావాదేవీ పై ఫిర్యాదు రావడంతోనే సోదాలు నిర్వహించాము అంటూ ఈడీ పేర్కొన్నది. వివేక్ కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ సెక్యూరిటీస్ మధ్యన రూ. 100 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. కానీ ఈ వ్యాపారం ద్వారా రూ. 20 లక్షల ఆదాయమే వచ్చిందట.

ఇంకా వివేక్ కు సంబంధించిన ఆస్తులు మరియు అప్పులతో కలిపి రూ. 64 కోట్లతో బాలన్స్ షీట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లావాదేవీలను పరిశీలిస్తే మాత్రం రూ. 200 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించామని ఈడీ చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news