గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూస్తే ఇదే అనుమానం కలుగుతుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి యార్లగడ్డ వెంకట్రావు మీద పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన జగన్ కి జై కొట్టారు.
ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు చేసారు. రాజకీయంగా ఆయన గుడ్ బై చెప్పే అవకాశం లేకపోయినా… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి అని చర్చలు జరిగాయి. ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేస్తూ చంద్రబాబు కి లేఖ రాసారు. ఆ తర్వాత విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
స్పీకర్ కూడా ఆయనకు ప్రత్యేక స్థానం కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు ఎమ్మెల్యే పదవికి…. స్పీకర్ కి రాజీనామా లేఖ పంపే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు. “పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.” అని పోస్ట్ చేసారు. దీనితో రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.