RTC లో డ్రైవర్లు 1275, కండక్టర్ల 789 మంది కొరత ఉందని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. EHS ద్వారా సదుపాయాలు అన్నీ అందడం లేదని, రిఫరల్ సరిగా జరగడం లేదని మా దృష్టికి వచ్చిందని వెల్లడించారు.
ఉద్యోగుల మెడికల్ ఫెసిలిటీల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. గత ప్రభుత్వం లో బస్టాండులకు నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ కష్టతరం అయిందని వివరించారు. రాబోయే రోజుల్లో బస్టాండులు ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అటు MLa విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ… ఆన్ కాల్ డ్రైవర్లు సరైన విధానం కాదన్నారు. ఆర్టీసీ డ్రైవర్లుగా అనుభవం లేని వారిని తీసుకురావడం వల్ల ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు.