బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగుచూడడం బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే సుశాంత్‌సింగ్ ప్రియురాలు రియాచక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్సీబీ విచారణ సందర్భంగా రియాచక్రవర్తి బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. వారు మరెవరో కాదు.. శ్రద్ధాకపూర్, సారాఅలీఖాన్. వీరికి త్వరలోనే ఎన్సీబీ సమన్లు జారీ చేయొచ్చని తెలిసింది. రియాచక్రవర్తి ఫోన్లోని వాట్సాప్ సందేశాల్ని తొలగించగా..ఎన్సీబీ అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి వాటిని సేకరించడంతో ఈ తతంగం బయటపడినట్లు తెలుస్తోంది. ఈ సందేశాల ఆధారంగా చేపట్టిన ప్రాథమిక విచారణలో శ్రద్ధాకపూర్, సారాఅలీఖాన్‌కు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఎన్సీబీ నిర్ధారించినట్లు సమాచారం. విచారణ నిమిత్తం ఈ వారంలోనే వీరిద్దరికి ఎన్సీబీ సమన్లు జారీ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి.