హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో డిసెంబర్ 04న పుష్ప-2 ప్రీమియర్స్ ప్రదర్శించిన సమయంలో హీరో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె కుమారుడు శ్రీ తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై కిమ్స్ హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అతని ఆరోగ్యం విషమంగానే ఉందని.. వెంటి లేటర్ పై కృతిమ శ్వాస అందిస్తున్నామని తెలిపారు. అతని జ్వరం తగ్గుతోందని మినిమం ఐనోట్రోప్స్ లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఫీడ్ లను బాగా తట్టుకుంటున్నాడని.. స్టాటిక్ న్యూరో లాజికల్ స్థితి దృష్ట్యా వెంటిలెటర్ నుంచి బయటికి తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఇవాళ సీపీ సీవీ ఆనంద్ శ్రీతేజ్ ను పరామర్శించారు. ఇవాళ ప్రభుత్వం తరపున తనతో పాటు హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా కూడా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నామని తెలిపారు.