శృతి సెకండ్ ఇన్నింగ్స్ పై కోలీవుడ్ లో జరుగుతున్న చర్చ ఇదే…!

సిజ్లింగ్ బ్యూటీ శృతిహాసన్ సెకండ్ ఇన్నింగ్స్ ను కోలీవుడ్ ఆసక్తిగా గమనిస్తుంది.చేసేది తెలుగు సినిమానే అయినా మనకంటే ఎక్కువగా ఈ ఫిలిం గురించి… ఇప్పటి నుంచే కోలీవుడ్ ఎక్కువగా థింక్ చేసేస్తుంది..దీనికో కారణం కూడా ఉందండోయ్. శృతిహాసన్ కెరియర్ …ఫారిన్ బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్సలే రాకముందు వరకు సూపర్బ్ గా సాగింది. ఎప్పుడైతే అమ్మడు ఈ వైట్ గయ్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి.. మ్యాటర్ ను మ్యారేజ్ వరకు తీసుకువెళ్లిందో అప్పుడే ఫిల్మీ ట్రాక్ గాడి తప్పింది.

కమల్ కూడా వీరి రిలేషన్ కు మద్దతు ఇవ్వడంతో అమ్మడు త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కుతుందనుకున్నారంత.కట్ చేస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ కు ఇద్దరి లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడిపోయిందని తెలిసి… తమిళ తంబీలు సంతోషపడ్డారు. శృతి ఇంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ లో వకీల్ సాబ్ తో మన ముందుకు వస్తానంటుంది. గతంలో తనకు ఎలాంటి క్రేజ్ లేని టైమ్లో ఇదే పవన్ తో గబ్బర్ సింగ్ చేసి ఎక్కడ లేని ఇమేజ్ సొంతం చేసుకుంది.ఆ తర్వాత ఆమె చేసిన తెలుగు,తమిళ సినిమాలు వరుస హిట్ లు కావడంతో.. పవన్ ను లక్కీ హీరోగా భావించింది.అదే ఫీల్ లో ఇప్పుడు తమిళ ఆడియన్స్ ఉన్నారు.

తాజాగా వకీల్ సాబ్ లో పవన్ కు వైఫ్ గా కనిపించే పాత్ర కావడంతో …పాత సెంటిమెంట్ రిపీట్ అవుతుందని మళ్ళీ శృతి కెరియర్ టర్న్ అవుతుందని తమిళ ఆడియన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.గబ్బర్ సింగ్ మాదిరిగా వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ గా మారితే తమిళ తంబీల ఆశకు అర్ధం ఉంటుంది.చూద్దాం ఈ సెకండ్ ఇన్నింగ్స్ శృతి కెరియర్ ఎలా టర్న్ అవుతుందో.