గోవాలో సచిన్‌ కూతురుతో ఎంజాయ్‌ చేస్తున్న శుబ్‌మన్ గిల్‌ !

-

సచిన్‌ కూతురు… సారా టెండూల్కర్‌, శుభ్‌మన్‌ గిల్‌ మధ్య ప్రేమయాణం సాగుతుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఈ వార్తలు వారిందరూ ఇంత వరకు ఖండించలేదు. దీంతో.. వారి మధ్య రిలేషన్‌ షిప్‌ ఉన్నట్లు అందరూ నమ్మేశారు. అయితే.. తాజాగా వీరిద్దరూ గోవాలో ఎంజాయ్‌ చేస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఈ జంట గోవాలో ఎంజాయ్‌ చేసిన ఫోటోలు కూడా వైరల్‌ గా మారాయి. దీనికి కారణంగా వారిద్దరూ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్టు చేస్తున్న ఫోటోలే కారణం.

సమయం దొరికినప్పుడు విదేశాలకు వెళ్లే.. సారా… ప్రస్తుతం గోవాలో ఉన్నట్లు ఆమె షేర్‌ చేస్తున్న ఫోటోలను బట్టి తెలుస్తోంది. గాయం కారణంగా.. సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ కు ఎంపిక కానీ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా గోవాలో ఉన్నట్లు అతను ఇన్‌ స్టాలో పోస్టు చేసిన ఫోటోలను బట్టి అర్థమవుతోంది. అంతేకాకుండా.. ఈ ఇద్దరూ పోస్టు చేసిన ఫోటోలు, ఒకే ప్రాంతంలో ఉన్నట్లుగా.. ఒకే దగ్గర ఉన్నట్లుగా అనుమానాలు వచ్చేలా ఉన్నాయి.

అదీకాక సారా గోవా నుంచి మాల్దీవులకు వెళితే.. శుభ్‌మన్‌ గిల్‌ కూడా మాల్దీవుల్లో ఓ రిసార్ట్‌ లో చిల్‌ అవుతున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఇలా ఇద్దరూ ఒకే దగ్గర ఉండి ఫోటోలను వేర్వేరుగా పంచుకునారా అనే సందేహం అందరిలో వస్తుంది. ఈ ఫోటోలు వైరల్‌ కావడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version