BREAKING : SI ఫైనల్ ఎగ్జామ్ హల్ టికెట్ లు రిలీజ్…

-

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై పోస్ట్ లకు ఇటీవల నోటిఫికేషన్ లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫైనల్ పరీక్షల షెడ్యూల్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది, తాజాగా SI ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ లను ఆన్లైన్ లో విడుదల చేసింది. ఈ హాల్ టికెట్ లు ఈ క్షణం నుండి ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 12 గంటల వరకు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. కాగా SI ఫైనల్ పరీక్షలు ఏప్రిల్ 8 మరియు 9 తేదీలలో ఉదయం గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు … అలాగే మధ్యాహ్నం షెడ్యూల్ ను 2 .30 గంటల నుండి సాయంత్రం 5 .30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంకా హల్ టికెట్ లు డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ రీసెంట్ ఫోటోను దానిపై పేస్ట్ చేయాలి. ఇక పరీక్షకు వెళ్లే ముందు మీ ఆధార్ కార్డు ను తీసుకువెళ్లడం మాత్రం మరిచిపోకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version