సామాన్యులపై మరో భారం పడనుంది. ఇవాల్టి నుంచి పాల ధరలు పెరుగనున్నాయి. తాజాగా విజయ డెయిరీ పాల ధరను పెంచింది. టోన్డ్ మిల్క్ పై రూ. 3 పెంచినట్లు అధికారులు తెలిపారు. లీటర్ కు రూ.55 ఉన్న మిల్క్ ధర తాజా పెంపుతో 58 అయ్యింది.
డబల్ టోన్డ్ మిల్క్ ధర హఫ్ లీటర్ గతంలో రూ. 26 ఉండగా రూ. 27 కి చేరింది. ప్రస్తుతం మన దేశం లో పెట్రోల్, డిజీల్, వంట నూనెలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి పోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెట్రోల్, వంట గ్యాస్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపించేలా ఓ రేంజ్ లో పెరిగి పోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇవాల్టి నుంచి పాల ధరలు పెరుగనున్నాయి.