తెలంగాణలో ఆగస్టు 26న నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ల డౌన్ లోడ్ చేసుకునేందుకు శుక్రవారం (ఆగస్టు 24) గడువు ముగియనుంది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేస్తున్నారు. సంబంధిత వెబ్ సైట్ www.tslprb.in నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ కానివారు [email protected] కి ఈ – మెయిల్ చేయొచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఏ4 సైజులో రెండు వైపులా వచ్చేలా ప్రింట్ తీసుకుని పాస్ పోర్ట్ ఫోటోని అతికించాలని అధికారులు సూచించారు.
S.I ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ కి నేడే తుది గడువు
-