విజయ్‌దేవరకొండ వంటి హీరోలు రాకముందే.. ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఓ తమిళ తంబీ… ఏడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అతను తెలుగు హీరో కాదు. కానీ.. తెలుగబ్బాయి కన్నా స్పష్టంగా మాట్లాడతాడు. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటాడు.
సిద్దార్ధ తమిళ హీరో అంటే నమ్మడం కష్టమే. తనే డబ్బింగ్ చెప్పుకున్నా… అరవ యాస ఎక్కడా కనిపించదు. అప్పటికే మూడు తమిళ సినిమాల్లో నటించిన సిద్దు 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ అనే హిట్‌తో తెలుగులోకి అడుగుపెట్టారు. డెబ్యూ మూవీతో క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా.. ఫ్యామిలీ.. యూత్‌ను ఒకేసారి ఫ్లాట్ చేశాడు.
సిద్దార్ధ గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకి పడిపోతూ వచ్చింది. ఆట.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఏవరేజ్ కాగా.. ఆతర్వాత వరుస ఫెయిల్యూర్స్ వెంటాడాయి. దీంతో.. తెలుగులో ఛాన్సులు తగ్గడంతో తమిళంలో బిజీ అయ్యాడు. ఏడేళ్ల క్రితం తనకు మంచి ఫ్రెండ్ అయిన ఎన్టీఆర్ కోసం.. బాద్షాలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చాడు. ఆతర్వాత తెలుగులో నటించలేదు.
ఏడేళ్ల గ్యాప్ తర్వాత సిద్దు డైరెక్ట్‌గా నటిస్తున్న తమిళ చిత్రం ‘మహాసముద్రం’. ఇందులో శర్వానంద్ హీరో కాగా.. సిద్దార్థ కీ రోల్ పోషిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 తీసిన అజయ్ భూపతి దర్శకత్వంలో ఎకె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్న సిద్దూకి మహాసముద్రంలో కథ, తన క్యారెక్టర్ నచ్చి ఓకె చేశాడు. సిద్దు ఫస్ట్ ఇన్నింగ్స్ సూపర్‌కాగా.. సెకండ్ ఇన్నింగ్ ఎలా వుంటుందో చూడాలి.