సిద్దు జొన్నలగడ్డ బిహేవియర్ తోనే ఇదంతా..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన డీజే టిల్లు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమా కు సీక్వెల్ గా ‘టిల్లు 2 ను తీసుకొని వస్తున్నారు. ఇక ఈ సినిమా పై’ భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ మూవీని వచ్చే వేసవిలో రిలీజ్ కు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా పై వరసగా వివాదాలే వస్తున్నాయి. మొదట దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నాడు. తనని ఎందుకు తప్పుకున్నారు అని అడిగితే మళ్లీ అదే కాన్సెప్ట్ బేస్డ్ నేను తీయలేను అందుకే వచ్చేశా అన్నాడు. ఆ తరువాత హీరోయిన్ కూడా మారింది. ఇందులో నేహాశెట్టికి కూడా అవకాశం లేకుండా పోయింది. తర్వాత శ్రీ లీల అని కొన్ని రోజులు టాక్ నడిచింది. కాని ఆమె బదులుగా అనుపమ పరమేశ్వన్ తీసుకున్నారు.

ఇక ఆమె కూడా ఈ సినిమా చేయనని షూటింగ్ మధ్యలోనే వెనక్కి వచ్చేసింది. దీనితో అసలు కారణం ఏమిటా అని ఆరా తీయగా అన్నిటికీ మూలం సిద్దు అని అంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో సిద్దు డైలాగ్స్ తో పాటు అన్నింట్లో వేలు పెట్టాడట. అందుకే డైరెక్టర్ వెళ్ళిపోయాడట. ఇప్పుడు హీరోయిన్స్ తో కూడా హాట్ సన్నివేశాల విషయంలో మరియు తన బిహేవియర్ వల్ల అనుపమ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందట దానితో ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఇంత గోల మధ్య ఆ సినిమా సమ్మర్ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.