​ధనుర్మాసంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?

-

మార్గశిరమాసంలో వచ్చే ధనుర్మాసం అత్యంత పవిత్రమైన రోజులు. ఈ సమయంలో వివాహాలు జరిపించరు. ఎందుకంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయం. గురు మూఢమి వచ్చింది. కాబట్టి శుభకార్యాలు చేయ్యరు. ధనుస్సు , మీనంలో సూర్యుడు ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించరాదని శాస్త్రవచనం. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు.

ఇలా చేయటం శుభం. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది. సంక్రాతి వెళ్లే వరకు గొబ్బెమ్మలను పెడుతారు. శాస్త్రం ప్రకారం చూసిన ఈ మాసంలో చలి తీవ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలా రకాల సూక్ష్మజీవులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకోసం మన పూర్వీకులు ఈ మాసంలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టడం వల్ల సూక్ష్మజీవులు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తాయి. వీటికితోడు పసుపు, కుంకుమ, కొన్ని రకాల ఆకులను ఉపయోగిస్తారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news