భారత్ లో ఇటీవల కాలంలో ట్రాఫిక్ రూల్స్ అంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. గతంలో కంటే కూడా తాజాగా పెరిగిన ట్రాఫిక్ రూల్స్ తో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఇదివరకూ లైసన్స్ లేకుండా బండి నడిపితే 200 నుంచీ 500 వరకూ ఉండేది కాని ఇప్పుడు ఈ ఫైన్ 5000 కి చేరింది. ఇక ఫుల్ గా తాగి బండి నడిపే వారికి 2000 ఫైన్ ఉండేది కాని ఇప్పుడు పెరిగిన ట్రాఫిక్ రూల్స్ దృష్ట్యా 10000 కి చేరింది. ఇవి మాత్రమే కాదు గతంలో ఉన్న ఫైన్స్ కంటే కూడా మూడింతలు పెరగడంతో భారత ప్రజలు గగ్గోలు పెట్టారు. కానీ
దుబాయ్ దేశంలో మాత్రం ఈ ట్రాఫిక్ రూల్స్ పై తాజాగా ప్రభుత్వం విధించిన నిభందనలు వింటే కళ్ళు గిర్రున తిరుగక మానవు. మనకి వేలల్లో ఫైన్ లు ఉంటే, అవే రూల్స్ కి అక్కడ లక్షల్లో ఫైన్ లు విదిస్తున్నారట. దాంతో దుబాయ్ లో ఉండే ప్రజలు వామ్మో ఇవెక్కడి రూల్స్ రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట. మరింకెందుకు ఆలస్యం అక్కడి ప్రజలని బెంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ రూల్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
నంబర్ ప్లేట్ లేకుండా ఎటువంటి వాహనం నడిపినా 58,000 రూపాయలు కట్టాల్సిందేనట.భారీ శబ్ధాలతో వాహనాలు నడిపితే రూ. 38,700/- అలాగే, గంటకి 80 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా బండి నడిపితే 58,050. క్రాసింగ్ ల వద్ద ప్రయాణికులని ప్రమాదాలని గురిచేస్తే రూ. 2లక్షల 90 వేలు, యాక్సిడెంట్ చేసి ప్రాణాలు కోల్పోయేలా చేస్తే 5 లక్షల 80 వేల రూపాయలు గా నిర్ధరించారట. దాంతో ఇప్పుడు దుబాయ్ ప్రజలు బయటకి వెళ్ళాలంటే ఒకటిసి రెండు సార్లు అలోచించి మరీ వెళ్తున్నారట.