మాజీ ఎంపీ కవిత పిలుపు.. పిడికిలి బిగించిన సింగరేణి.!

-

సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు‌ మేరకు సింగరేణి కార్మికులు నేటి నుంచి సమ్మె మొదలుపెట్టారు. టీబీజీకేఎస్ ఇచ్చిన 24 గంటల సమ్మె గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సింగరేణి బొగ్గు గనుల్లో ప్రారంభమయ్యింది. దీంతో అన్ని గనులు మూడపడ్డాయి.

ఫలితంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలో 12 భూగర్భ గనులు 5 ఓపెన్ కాస్ట్ గనులలో సుమారు 17 వేల మంది కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె సందర్భంగా ఒక్కరోజు సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సమ్మెలో భాగంగా మోదీ ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news