ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం..!

-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా ఏపీ సచివాలయం, అసెంబ్లీలలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇప్పటికే కరోనా భయాలతో సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాలను పూర్తిగా శానిటైజ్ చేయడంతో పాటు పలు చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా సచివాలయంలో మరో పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే అసెంబ్లీలో మరో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.

దీంతో సచివాలయం, అసెంబ్లీలలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో భాగాంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగుల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. బాధితులను గుంటూరు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరితో సన్నిహితంగా మెలిగిన మరికొందరిని క్వారంటైన్ కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news