గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

-

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు. హోటల్ కు వెళ్లిన కొద్దీ సేపటి తర్వాత గుండె పోటు రావడంతో మరణించాడు. అయితే కున్నత్ కు అప్పటికి పెద్ద వయసు కూడా కాకపోవడం అక్కడ ప్రోగ్రాం కు వచ్చిన ప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది. దీనితో తన అభిమానులు సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ విషాద ఘటనకు నిన్నటితో సరిగ్గా ఏడాది అయింది. ఈ యువ గాయకుడికి గుర్తుగా ఎక్కడ అయితే చనిపోయాడో అక్కడే శింగింగ్ చేస్తున్నట్లుగా మైక్ పట్టుకున్నట్లు విగ్రహాన్ని తయారుచేసి అక్కడ ప్రతిష్టించారు.

ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఇలాంటి వారు ఈ గౌరవానికి అర్హులు అని చెప్పాలి. కోల్కతా ప్రేక్షకులకు కళాకారులూ అంటే ఎంత అభిమానమో ఈ సంఘటనతో మరోసారి రుజువయింది.

Read more RELATED
Recommended to you

Latest news