“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

-

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు. అయితే కొంతమందికి ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చి దర్శకుడిని మరియు నటీనటులను అభినందించారు. వారిలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉండడం విశేషం, అంతే కాకుండా ఈ సినిమాను అందరూ వీక్షించాలని ప్రమోట్ కూడా చేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసి ప్రశ్నించారు. ముస్లిం కులాన్ని తక్కువ చేయడానికి మాత్రమే ఈ సినిమాను తీశారని అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాను మోదీ కూడా ప్రమోట్ చేయడం బాధాకరమన్న అభిప్రాయంతో అసదుద్దీన్ మాట్లాడారు.

 

 

కానీ గుజరాత్ బీబీసీ డాక్యుమెంటరీ పై ఎందుకు నిషేధాన్ని విధించలేదని ఈయన ప్రశ్నించారు. ఇలాంటి వాటి వలన ముస్లిం లపై విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news