బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడు లోని తీర ప్రాంతంలో డిఆర్ఐ మరియు తీరా ప్రాంత గస్తీ సిబ్బంది కాచుకుని భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. గల్ఫ్ అఫ్ మన్నార్ దగ్గర రూ. 20 కోట్ల విలువ చేసే 32 .7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే విచారణలో తెలిసిన ప్రకారం శ్రీలంక నుండి భారత్ కు ఒక జాలర్ల బోట్ లో తరలిస్తుండగా పట్టుకున్నారు. దీని వెనుక ఎవరైనా ముఠా ఉన్నారా లేదా అన్న విషయాలు తదుపరి విచారణలో బయట పడనున్నాయి. . కాగా ఈ వార్తను చూసిన ఎవరైనా ఇక మీదట ఇలాంటి కార్యకలాపాలకు పలాడకుండా ఉండాలని ఆశిద్దాం.