మంగ్లీయా మ‌జాకా… యూట్యూబ్ నంబ‌ర్ 1 ట్రెండింగ్ లో క‌న‌క‌వ్వ ఆడ నెమ‌లి సాంగ్‌..!

-

వైవిధ్య‌భ‌రిత‌మైన పాట‌ల‌ను ఆల‌పించ‌డంలో ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఆమె పాట‌ల‌ను ఆల‌పిస్తుంటే వినే శ్రోత‌ల‌కు ఊపు వ‌స్తుంది. త‌న‌దైన శైలిలో ఆమె త‌న గాత్రంతో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటుంది. ఇప్ప‌టికే మంగ్లీ పాడిన ఎన్నో పాట‌లు జ‌నాల‌ను అమితంగా అల‌రించాయి. ఈ నేప‌థ్యంలో ఆమె తాజాగా మ‌రొక పాట‌తో జ‌నాల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ పాట కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిస్తోంది.

క‌న‌క‌వ్వ ఆడ నెమ‌లి పేరిట సింగ‌ర్ మంగ్లీ పాడిన పాట యూట్యూబ్ ప్రేక్ష‌కుల‌నే కాక‌.. సంగీత ప్రియుల‌ను కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఆగ‌స్టు 29న ఈ పాట‌ను ఆవిష్క‌రించ‌గా.. ఇప్ప‌టికే 28 లక్ష‌ల‌కు పైగా వీక్ష‌కులు ఈ పాట‌ను యూట్యూబ్‌లో చేశారు. ఇంకా వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. 91వేల‌కు పైగా ఈ పాట‌కు లైక్‌లు వ‌చ్చాయి. 4వేల మందికి పైగా కామెంట్లు చేశారు.

ఈ పాట‌ను విన్న వారంద‌రూ అద్భుతంగా ఉంద‌ని మంగ్లీకి కితాబిస్తున్నారు. అలాగే ప్ర‌స్తుతం ఈ పాట లోక‌ల్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబ‌ర్ 1 స్థానంలో కొన‌సాగుతోంది. ఈ ఒక్క విష‌యం చాలు.. ఈ పాట ఎంత‌గా హిట్ అయిందో చెప్ప‌డానికి. ఇందులో క‌న‌క‌వ్వ‌తోపాటు కొరియోగ్రాఫ‌ర్ జాను లిరి కూడా మంగ్లీతో క‌లిసి పాడారు. స్టెప్పులు వేశారు. మ‌రి మీరు కూడా ఈ పాట‌పై ఓ లుక్కేయండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version