ఇరాన్ టాప్ కమాండర్ జనరల్ ఖాసీం సోలైమానీని అమెరికా గత నెలలో హతమార్చిన సంగతి తెలిసిందే. తమకు ప్రమాదకరంగా మారడంతోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖాసీం ని హతమార్చాలని ఆదేశాలు జారి చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు దారుణంగా క్షీణించాయి. ఇరాన్ ఎం చేస్తుందో అనే ఆందోళన అటు అమెరికాలో ఇటు ప్రపంచ దేశాల్లో నెలకొంది.
అతన్ని పక్కా వ్యూహంతో అమెరికా సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే అతన్ని ఏ విధంగా అమెరికా హతమార్చింది అనేది తాజాగా ఒక వార్తా ఛానల్ కొన్ని కీలక విషయాలను బయటపెట్టింది. 2020 అధ్యక్ష ఎన్నికల కోసం నిధులు సమీకరించేందుకు ఇటీవల ఏర్పాటైన కార్యక్రమంలో ట్రంప్ అక్కడికి వచ్చిన కొందరితో ట్రంప్, మాట్లాడుతూ సమయంతో సహా వివరించారని పేర్కొంది.
సర్, వాళ్లందరూ ఒకే కారులో ఉన్నారు. ఇక వాళ్లకి 2 నిమిషాల 11 సెకెన్లే మిగిలి ఉన్నాయి. ఇక వాళ్లకు మిగిలింది 1 నిమిషం 11 సెకన్లే.. సర్. 30 సెకెన్లు, 9, 8, 7..’ అంటూ అధికారులు తనతో వివారాలు పంచుకున్నారని ఆ తర్వాత బూమ్ అంటూ పెద్ద శబ్దం వినపడింది అని ట్రంప్ చెప్పినట్టు ఆ మీడియా పేర్కొంది. దానికి సంబంధించిన ఆడియో కూడా తమ వద్దని ఆ ఛానల్ చెప్పడం గమనార్హం.