పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతాను కలిగి ఉన్నారా… లేదా మీకు సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఖాతా ఉందా.. అయితే మీకో వార్త. పిల్లల భవిష్యత్ కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), లేదా సుకన్య సమృద్ధి యోజనలో ఖాతాను తెరిచి ఉండాలి. ఈ ఆఫర్ ను మీరు మిస్ చేసుకోవద్దు అనుకుంటే తొందరగా ఈ ఖాతాలను తెరుచుకోండి.
సుకన్య సమృద్ధి యోజన పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ఫథకాల గురించి అందరికి తెలిసే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో, కొన్ని ప్రైవేట్ ఉద్యోగుల్లో మాత్రమే పీపీఎఫ్ అమలవుతోంది. ఈ రెండు స్కీంలు దీర్ఘకాలం వరకూ పెట్టుబడి పెట్టుకోవచ్చు. పిల్లల భవిష్యత్ కోసం ఈ స్కీంలలో డబ్బులను పెట్టుబడి చేయాలి. కాల పరిమితి ముగిసిన తర్వాత ఇంట్రెస్ట్ తో కలిపి కేంద్రం చెల్లిస్తుంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఎవరైనా చేరవచ్చు. కానీ, సుకన్య సమృద్ధి యోజనలో కేవలం ఆడపిల్లలకు మాత్రమే ఛాన్స్ ఉంది.
జూలై 31 లోపూ సుకన్య స సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అందించే బెనిఫిట్స్ ను పొందవచ్చు. దేశ వ్యాప్తం కోవిడ్-19 శరవేగంగా విస్తరిస్తుండటంతో బీజేపీ ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పీపీఎఫ్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేయని వారుంటే వెంటనే అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయండి.జూలై 31తో గడువు ముగిస్తుంది. గడవులోపు చెల్లిస్తే చార్జీలు వర్తించదు. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
సుకన్య సమృద్ధి యోజనలో చేరాలనుకుంటే పదేళ్లలోపు ఆడపిల్లను కలిగి ఉండాలి. దీంతో ఈ స్కీంలో డబ్బులు పెట్టుబడి పెడితే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. కరోనా నేపథ్యంలో కేంద్రం పదేళ్ల దాటినా వారికి ఈ పథకంలో చేరేందుకు అనుమతినిచ్చింది.