BREAKING : తెలంగాణలో మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!

-

ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూత పడనున్నాయి. గత కొన్నేళ్ళుగా ఈ కాలేజీల్లో చాలా తక్కువస్థాయిలో అడ్మిషన్లు జరిగాయని జెఎన్టీయూ హెచ్ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఈ కాలేజీలన్నీ వివిధ జిల్లాల్లో వున్నాయని ఆయన అన్నారు. అడ్మిషన్లు లేకపోవడం వల్ల ఈ కాలేజీల నిర్వహణకు యాజమాన్యాలకు తలకు మించిన భారంగా మారింది. దీంతో వాటిల్లో ఉన్న దాదాపు 4 వేల సీట్లు రద్దు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 201 ఇంజనీరింగ్‌ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతులు ఇవ్వగా, మరో 16 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి.

ఆయా కాలేజీల్లోని దాదాపు 4 వేల సీట్లలో మొదటి సంవత్సరం ప్రవేశాలు వద్దని జేఎన్‌టీయూకు దరఖాస్తు చేశాయి. కాగా, కొన్నేళ్ళ క్రితం తెలంగాణలో కుప్పలుతెప్పలుగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వేలాదిమంది విద్యార్ధులు వాటిలో చేరిపోయి పట్టాలతో బయటకు వచ్చారు, అయితే ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, బోధన సరిగా లేకపోవడం వల్ల కొన్నింటిని ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news