అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చంద్రబాబు చేతులెత్తేశారు.ఎర్ర బుక్‌లో రాసినవన్నీ అక్రమ కేసులే..పోలవరం నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.షర్మిల ఎవరి కోసం పనిచేస్తుందో అందరికీ తెలుసు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తుందని ఫైర్ అయ్యారు. అలాగే, ప్రతీరోజు ఏదో ఒకదానిపై అసత్యాలు, తప్పుడు అంకెలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.పేర్ని నాని శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదు.సంపద సృష్టించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.. ఏమైంది?. అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు అని విమర్శించారు. 2019లో సంపద ఎక్కడుందో ఎవరికీ కనిపించలేదు. అప్పులు సృష్టించడంలో ఆంధ్ర ప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిసే పోలవరాన్ని నాశనం చేశారు. నచ్చినోళ్లకు కాంట్రాక్ట్‌లు ఇచ్చి ప్రాజెక్ట్‌ను నాశనం చేశారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆరడగుల అబద్ధం చంద్రబాబు అని విమర్శించారు.