మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే..!

-

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు.. మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు..ఇక, ఛాంబర్లలో మార్పులు, చేర్పులతో.. ఆలస్యం కారణంగా ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు తన ఛాంబర్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయనకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందలు తెలిపారు.. మరోవైపు.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే 6 ఫైళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు సంతకాలు చేశారు.పొలం పిలుస్తుంది కార్యక్రమంపై తొలి సంతకం, వ్యవసాయ యాంత్రీకరణపై రెండో సంతకం, 217 జీవో రద్దు చేస్తూ మరో సంతకం.. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ నిధుల విడుదలపై ఇంకో సంతకం.. పశువుల డీవార్మింగ్, యానిమల్ సెన్సెస్‌పై ఇలా ఆరు సంతకాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.ఇక, ఈ సందర్భంగా మంత్రి అచెన్నాయుడు మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ శాఖకు తాళం వేశారు.. కానీ, కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదు.. రైతు ఆత్మగౌరవంతో బతికేలా పనిచేస్తాం అని తెలిపారు. కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పారు.సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ,రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news