టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి దిమ్మ తిరిగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేశారు ప్రజా ప్రతినిధిల కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్. 2013 లో జరిగిన అల్లర్ల ఘటన లో ఆయనకు శిక్ష వేస్తూ ప్రజా ప్రతినిధిల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తిపై దాడిచేసి గాయపరిచారు అనే అభియోగాలు రుజువు కావడంతో దానం నాగేందర్ కు జైలు శిక్ష విధించింది.
దీనిపై అప్పీలు కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన న్యాయ స్థానం.. శిక్ష అమలును మరో నెల రోజులు వాయిదా వేసింది. అంతేకాదు ఆరు నెలల జైలు శిక్ష తో పాటు రూ. 1000 జరిమానా విధించింది కోర్టు. కాగా… 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ చేరారు దానం నాగేందర్. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ఖైరతాబాద్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దానం నాగేందర్.