రాజకీయాల్లో నేతలు చేసే పనులు కొన్నిసార్లు వారికంటే ప్రత్యర్థులకే ఎక్కువగా మేలు చేస్తుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి revanth reddy చేసిన పని కూడా టీఆర్ ఎస్‌కు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఈ పని కావాలని చేయకపోయినా.. లోతుగా ఆలోచిస్తే ఆయన చేసిన పని మాత్రం గులాబీ బాస్ కేసీఆర్‌కు కొంత మేలు చేసిందనే చెప్పొచ్చు. అదేంటో ఇపుడు తెలుసుకుందాం.
రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఇలా బాధ్యతలు చేపట్టాడో లేదో గానీ ప్రతి ఒక్కరినీ కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి మరీ ఆయన పలువురు పెద్ద నేతలను కలుస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన రీసెంట్ గా బెంగళూరుకు వెళ్లి కాంగ్రెస్ కీలక నేత అయిన మల్లిఖార్జున ఖర్గేను అలాగే డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు.
ఆ తర్వాత నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావుతో భేటీ అయి పలు విషయాలపై చాలా సేపు చర్చించారు. ఇప్పుడు ఇదే విషయం మీద కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో కేసీఆర్ చెప్పిన విషయాల్లో లక్ష నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నుతాననేది చాలా కీలకమైంది. దానిపైనే ఇప్పటి వరకు కాంగ్రెస్ విమర్శలు చేస్తూ వస్తోంది. కానీ రేవంత్ పనితో కాంగ్రెస్‌కు ఆ చాన్స్ మిస్ అయింది. ఒకవేళ విమర్శిస్తే రేవంత్‌పైనే కౌంటర్లు పడే ఛాన్ష్ ఉంది.