నేపాల్‌లో భూకంపం సంభవించింది. దోతి జిల్లాలో అర్ధరాత్రి 1.57 గంటలకు భూకంపం వచ్చింది. మరోసారి 2.12 గంటలకు అదే జిల్లాలో భూమి కంపించింది. ఈ ఘటనలో ఇళ్లు కూలి ఆరుగురు దుర్మరణం చెందారు. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
నేపాల్ భూకంపంతో దిల్లీలో భారీగా భూప్రకంపనలు ఏర్పడ్డాయి. ఉత్తరఖండ్‌లోని పితోరాఘర్‌కు ఆగ్నేయంగా 90 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి భూకంపం రావడంతో నిద్రలోనే కొంతమంది చనిపోయారు. అకస్మాత్తుగా నిద్రలో భూమి కంపించడంతో చాలా మంది లేచి ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దోతి జిల్లాలో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.