అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. టెన్నెస్సీ రాష్ట్రంలో తుపాకీ గర్జన కలకలం సృష్టించింది. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మిస్సిస్సిపీలోని అర్కాబుట్ల అనే ఓ చిన్న పట్టణంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు.
ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కాల్పులు జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఒక్కడే కాల్పులు జరిపినట్లు భావిస్తున్న పోలీసులు అందుకు గల కారణాలను విచారణ జరుపుతున్నారు. మెంఫిస్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే అర్కాబుట్ల పట్టణంలో 285 మంది మాత్రమే నివసిస్తారని 2020 జనాభా లెక్కల ప్రకారం తెలుస్తోంది.