Tips For Girls Safety : ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. ఆఫీసు నుండి లేదా కాలేజీ, స్కూల్ నుండి ఆడపిల్ల ఆలస్యం అయితే చాలు తల్లిదండ్రులకి భయం వేస్తోంది. ఆడపిల్లల రక్షణ కోసం కచ్చితంగా కొన్ని టిప్స్ పాటించాలి. ఇలా చేయడం వలన ఆడపిల్లలకి ప్రమాదం ఉండదు.
మొబైల్ ఫోన్ ని చేతిలో ఉంచుకోవాలి:
ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఆలస్యంగా వెళ్తున్నప్పుడు లేదా చీకటి పడిపోయినప్పుడు మొబైల్ ఫోన్ ని చేతిలో ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ నెంబర్ ని ముందే డయల్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు వెంటనే కాల్ చేయడానికి అవుతుంది.
ఎవరికైనా కాల్ చేయండి:
ఎవరికైనా కాల్ చేసి కాల్ లో ఉండేటట్టు చూసుకోండి. కంటిన్యూస్ గా మాట్లాడండి. వీడియో కాల్ చేస్తే మరీ మంచిది.
ఎప్పుడూ వెళ్లే దారిలోనే వెళ్ళండి:
రాత్రిపూట ఒంటరిగా వెళ్లేటప్పుడు మీరు కొత్త కొత్త దారుల్లో కానీ షార్ట్ కట్స్ లో కానీ వెళ్ళకండి. ఎప్పుడు వెళ్లే దారిలోనే మీరు వెళ్తే మంచిది.
ఉమెన్స్ సేఫ్టీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి:
ఒంటరిగా వెళ్లేటప్పుడు ఎప్పుడూ కూడా మీ ఫోన్ ని ఫుల్ గా ఛార్జ్ పెట్టుకోండి. ఫోన్లో సేఫ్టీ యాప్స్ ని ఉంచుకోండి. ఎప్పుడైనా అవసరమైతే వెంటనే ఉపయోగించవచ్చు.
క్యాబ్ లో వెళ్లేటప్పుడు ఇలా చేయండి:
ఒంటరిగా మీరు ఏదైనా క్యాబ్లో వెళుతున్నప్పుడు క్యాబ్ లో కూర్చున్నాక మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఫోన్ చేయండి. క్యాబ్ నెంబర్, లైవ్ లొకేషన్ వంటివి పంపించండి. క్యాబ్ డ్రైవర్ కి అర్థమయ్యేటట్టు క్యాబ్ డ్రైవర్ నెంబర్ లొకేషన్ ని పంపించండి. పెప్పర్ స్ప్రే, చిల్లీ స్ప్రే, సేఫ్టీ నైఫ్ వంటివి మీతో పాటు తీసుకెళ్లండి. ఇలా చేయడం వలన మీకు రక్షణ ఉంటుంది మిమ్మల్ని ఎవరైనా అంటే దాడి చేయడానికి కూడా అవుతుంది.