ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమేనని నిరూపించాడు ఆరేళ్ల బాలుడు. చెల్లి ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో భాగంగా అతడు చేసిన పోరాటం ఇప్పుడు అడిని వరల్డ్ ఛాంపియన్‌గా మార్చేసింది. అతడో హీరో అంటూ ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్స్ కీర్తిస్తున్నారు. నా ప్రాణాలు పోయిన పర్వాలేదు చెల్లిని కాపాడుకోవాలని నేను అనుకున్నాను అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అమెరికా వ్యోమింగ్‌కు చెందిన బ్రిడ్జర్ వాకర్ ఇటీవల తన చెల్లితో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఒక వీధి కుక్క వారిద్దరి పైకి వచ్చింది. చెల్లికి అడ్డుగా నిలబడి కుక్కతో పెనుగులాడాడు. ఆ క్రమంలో అతడి మొహంను కుక్క చీల్చింది. తృటిలో ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డాడు. కొద్ది సేపు పెనుగులాట తర్వాత చెల్లితో రక్తం ఒడ్డుతున్నా అక్కడ నుండి పరిగెత్తాడు.
ఈ క్రమంలో చెల్లికి చిన్న గాయం కాకుండా అతడు కాపాడుకున్నాడు. అతడి మొహంపై ఏర్పడిని గాయంకు రెండు గంటల పాటు ఆపరేషన్ చేశారు. దాదాపుగా 90 కుట్లు వేసినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. బ్రిడ్జర్ వాకర్ సాహసంకు ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ వారు ‘గౌరవ ప్రపంచ ఛాంపియన్’గా అతడిని ప్రకటించడం జరిగింది.