“స్కంద” గ్రాండ్ రిలీజ్ రేపే… బోయపాటి హిట్ కొడతాడా !

-

టాలీవుడ్ లో బోయపాటి శ్రీను తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నాడు.. బోయపాటి సినిమాలు హిట్ అయినా, సరిగా ఆడకపోయినా తన స్టైల్ లోనే సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్స్ ను సృష్టించుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. గత సంవత్సరమే బాలయ్య తో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ని అందించిన బోయపాటి ఇప్పుడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో స్కంద సినిమాను తెరకెక్కించారు. బోయపాటి టేకింగ్ కు రామ్ బాడీ లాంగ్వేజ్ సరిపోయిందా లేదా అన్నది తెలియాలంటే రేపు మొదటి షో పూర్తి అయ్యే వరకు వెయిట్ చెయ్యాలి. కాగా ఈ సినిమాపై రామ్ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. రామ్ గత రెండు సినిమాలు రెడ్ మరియు ది వారియర్ లు ప్లాప్ లు కావడంతో ఆశలన్నీ దీనిపైనే ఉన్నాయి. పైగా బోయపాటి కథలను మాస్ స్టైల్ లో చెప్పడంలో సిద్ధహస్తుడు.

ఇక లక్కీ గర్ల్ శ్రీలీల ఇందులో రామ్ కు హీరోయిన్ గా చేసింది.. ఇక బోయపాటి రామ్ ల కాంబినేషన్ వర్క్ అవుట్ అయిందా అన్నది తెలియడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news