నారా భువనేశ్వరికి మద్దతుగా నటి పూనమ్ కౌర్… !

-

చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయంగా పార్టీని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కుటుంబంపై పడిందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మరియు కోడలు బ్రాహ్మణీలు రోడ్డెక్కి కార్యకర్తలు అధైర్యపడద్దని చెబుతున్నారు. ఇక రాజకీయంలో మెగా లేదు ఆడ లేదు ఎవరనీ చూడకుండా విమర్శలు చేయడం సహజమే. ఇక భువనేశ్వరి క్యారక్టర్ పై చేసిన కామెంట్స్ పట్ల సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పింది ముమ్మాటికీ నిజం రాజకీయాలలో ఎటువంటి ప్రయోజనాల కోసం ఏ స్త్రీని కానీ లేదా కుటుంబాన్ని కానీ విమర్శించడం మరియు తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ మద్దతుగా నిలిచింది.

ఇక ఇప్పటికే తనను విమర్శించినా వారికీ సభాముఖంగా.. నేను ఏమిటో నాకు తెలుసు.. నా కుటుంబానికి తెలుసు ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు ఇంకా రిమాండ్ లో ఉండగా.. ఎఫ్ ఐ ఆర్ కొట్టేయాలని పిటీషన్ ను సుప్రీమ్ కోర్ట్ లో వేశారు.. విచారణ జరుగుతూ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news