వయసు ముఫ్ఫై దాటుతున్నప్పుడు శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. దానిలో మొదటగా చర్మంలో ఎక్కువ మార్పు వస్తుంది. ఇలాంటి టైమ్ లో చర్మ సంరక్షణ విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. 20ల్లో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోకపోయినా ఫర్వాలేదు కానీ, 30ల్లోకి వచ్చాక ఖచ్చితంగా జాగ్రత్త అవసరం. మీ వయసు 30దాటుతున్నప్పుడు మీ చర్మం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మ సంరక్షణ అనగానే చర్మ సాధనాలు వాడాలనుకుంటే పొరపాటే. మీరు తీసుకునే ఆహారాలు కూడా మీ చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల మీరు తీసుకునే ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు ఉండాలి. దీనివల్ల అనవసర పదార్థాలు శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి.
మీ చర్మ రకాన్ని బట్టి విటమిన్ సి, విటమిన్ ఈ సప్లిమెంట్లను తీసుకోవడం ఉత్తమం.
ఏ రకమైన చర్మ సాధనాలు వాడిటే మీ చర్మానికి మేలు కలుగుతుందో తెలుసుకోవాలి. అన్ని రకాల చర్మ సాధనాలను మీ చర్మంపై అప్లే చేయవద్దు.
కావాల్సినన్ని నీళ్ళు తాగండి. దానివల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడు చర్మ సురక్షితంగా ఉంటుంది.
ఆల్కహాల్, చక్కెర, కాఫీ మొదలగు వాటి సేవనం తగ్గించాలి. వాటివల్ల చర్మం మీద దుష్ప్రభావం కలుగుతుంది.
రాత్రిపూట వాడే క్రీములు చర్మాన్ని సురక్షితంగా ఉండేలా చేస్తాయి. కొల్లాజెన్ ఏర్పడడానికి ఇది కారణంగా ఉంటుంది.
సన్ స్క్రీన్ అస్సలు మర్చిపోవద్దు. బయటకు వెళ్ళినా,వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు మీ చర్మం మీద ప్రభావం చూపకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ తప్పనిసరి.