Skylab : అదిరిపోయిన స్కైలాబ్ ట్రైలర్.. రియల్ స్టోరీకి కామెడీ టచ్ !

-

డిఫరెంట్ పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ హీరో సత్యదేవ్. క్రైమ్ మరియు త్రిల్లర్ లాంటి సినిమాలతో… తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో డిఫరెంట్ కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సత్యదేవ్. సత్యదేవ్, నిత్యామీనన్ మరియు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం స్కైలాబ్.

విశ్వక్  ఖండేరావు దర్శకత్వంలో కొద్ది పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది చిత్రబృందం. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ విడుదల చేసింది స్కైలాబ్ యూనిట్. వాస్తవ ఘటనలకు కొద్దిగా హ్యూమర్ టచ్ ఇచ్చి విడుదల చేసిన ఈ ట్రైలర్ పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్ గా సాగింది. బండలింగంపల్లి అనే గ్రామంలో… నిత్యామీనన్ ఓ విలేకరిగా… అలాగే సత్యదేవ్ డాక్టర్ గెటప్ లో కనిపించాడు. అలాగే కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఆ గ్రామ సుబేదారుగా మనకు ట్రైలర్లో కనిపిస్తాడు.

అలాగే మన దేశంలో స్వతంత్రం రాకముందు… స్కైలాబ్ పడుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆకాశం నుంచి.. గ్రహ షకకాలు పడి ప్రజలు మరణిస్తానని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. దానికి కాస్త కామెడీ టచ్ ఆడ్ చేసి ఈ సినిమాను రూపొందించారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version