ఈ రోజు పంజాబ్ మరియు ఆంధ్ర జట్ల మధ్యన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో రికార్డు నమోదు అయింది. ఇప్పటి వరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే ఎన్నడూ చేయనంత స్కోర్ ను సాధించి పంజాబ్ జట్టు తమ పేరిట కొత్త రికార్డును లిఖించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. జట్టు ఇంత స్కోర్ సాధించడానికి ప్రధాన కారణం ఓపెనర్ అభిషేక్ శర్మ… ఇతను 51 బంతుల్లో 9 ఫోర్లు 9 సిక్సులతో 112 పరుగులు చేయగా, మరో ప్లేయర్ అన్మోల్ ప్రీత్ సింగ్ కేవలం 26 బంతుల్లోనే 87 పరుగులు చేసి ఔరా అనిపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. వీరి దెబ్బకు ఆంధ్ర బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు.
హరిశంకర్ రెడ్డి 66 మరియు పృథ్విరాజ్ 63 పరుగులు ఇచ్చారు. మరి ఈ స్కోర్ ను మరే టీం అయినా సాధిస్తుందా లేదా అన్నది తెలియాలంటే చూడాలి.