నాలుగు వారాల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి ఈ రోజు తో తెరపడనుంది. మొహాలీ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ మరియు బరోడా జట్లు తలపడుతున్నాయి, మొదట టాస్ గెలిచిన బరోడా ఫీల్డింగ్ ఎంచుకోగా… పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్ లలో నాలుగు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఒక దశలో పంజాబ్ కేవలం 18 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయి కష్టాల్లో పడింది, కానీ ఆ తర్వాత పుంజుకుని ఆడి బరోడా బౌలర్లను తుత్తునియలు చేసింది. ముఖ్యంగా అన్మోల్ ప్రీత్ సింగ్ మరియు నెహ్యాల్ వధేరా లు ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి పంజాబ్ కు విజయాన్ని అందించే స్కోర్ ను సాధించి పెట్టారు. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 138 పరుగులు జోడించారు.
అన్మోల్ ప్రీత్ సింగ్ 113 ( 6 సిక్సులు మరియు 13 ఫోర్లు) మరియు నేహల వధేరా 61 (4 సిక్సులు మరియు 6 ఫోర్లు) లు సాధించి జట్టుకు సహాయపడ్డారు. మరి టైటిల్ ను గెలుచుకోవాలంటే బరోడా జట్టు 20 ఓవర్లలో 224 పరుగులు చేయాల్సి ఉంది.