ఈ రోజు శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాత్యుస్ ను అంపైర్లు అవుట్ ఇచ్చిన విధానం పట్ల ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమయానికి బంతిని పేస్ చేయడానికి రెడీ గా లేని కారణంగా మాథ్యూస్ ను టైం అవుట్ గా ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ విషయాన్నీ ఫీల్డర్లు ఏ విధంగా సమయాన్ని వృధా చేస్తారు అన్న అంశాలతో ముడిపెట్టి ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. బౌలింగ్ టీం ఓవర్లను ఆలస్యంగా చేస్తే ఒక ఫీల్డర్ ను రింగ్ లోకి ఏ విధంగా అయితే తీసుకుంటారో, బ్యాట్స్మన్ లేట్ గా రావడం వలన సమయం వృధా అవుతుందని భావిస్తే పరుగులు పెనాల్టీ గా ఇవ్వొచ్చు. కానీ అవుట్ గా ప్రకటించి చాలా విమర్శలకు కారణం అయ్యారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఒక సీనియర్ క్రికెటర్ గా ఉండి షకిబుల్ హాసన్ మాత్యుస్ రిక్వెస్ట్ చేసుకున్నా సరే పట్టించుకోకుండా అవుట్ ఇవ్వాలంటూ అంపైర్ ను కోరాడు.
దీనితో ఇతనిపైన కూడా ఆట స్ఫూర్తి లేదన్న విషయంలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. ముందు ముందు ఈ విషయం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.