ఢిల్లీ లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది, మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు తక్కువ స్కోర్ కు కీలక వికెట్లు కోల్పోయిన దశలో అసలంక అసాధారణ ఇన్నింగ్స్ తో కోలుకుని బంగ్లాదేశ్ ముందు ఛాలెంజింగ్ టోటల్ ను ఉంచగలిగింది. ఒక దశలో శ్రీలంక జట్టు 72 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అసలంక 4వ వికెట్ కు 63 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాక సమరవిక్రమ (41) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతి కూడా పడకుండానే వివాదాస్పద రీతిలో మ్యాథ్యూస్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అసలంక డి సిల్వా తో కలిసి ఆరవ వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అలా శ్రీలంక ఇన్నిన్స్ నత్త నడకన సాగి చివరికి అసలంక (108) అద్భుతమైన సెంచరీ సాధించడంతో బంగ్లా ముందు 280 పరుగుల టార్గెట్ ను సెట్ చేసింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో తంజీమ్ హాసన్ షకీబ్ మూడు, షకీబ్ రెండు, షారిఫుల్ రెండు వికెట్లు తీసుకున్నారు.