Sneha: వెల్లివిరిసిన సంప్రదాయ సౌరభం..చీరకట్టులో అదరగొట్టిన స్నేహ

-

సీనియర్ హీరోయిన్ స్నేహ..హోమ్లీ బ్యూటీగా పేరు గాంచింది. తెలుగు స్టార్ హీరోలందరి సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసిన స్నేహ.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నది. ఈ సంగతులు పక్కనబెడితే స్నేహ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది ఈ సీనియర్ హీరోయిన్. ఇన్ స్టా గ్రామ్ వేదికగా లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో దిగిన ఫొటోలు షేర్ చేసింది.

లైట్ బ్లూ కలర్ శారీలో తగు ఆభరణాలు ధరించి అలా సోఫాలో కూర్చొని, నిలబడి, బయట ఔట్ డోర్ లో కూర్చొని రకరకాల స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫొటోలు చూస్తుంటే సంప్రదాయ సౌరభం వెల్లివిరిసినట్లుగా ఉంది.

అలా హోమ్లీ గా స్నేహ స్టిల్స్ ఇస్తుండటం చూసి నెటిజన్లు సంతోషపడుతున్నారు. ‘ఏంజెల్, డ్యామ్ గార్జియస్, వావ్, స్మైల్ సూపర్ ’ అని కామెంట్స్ చేస్తున్నారు. స్నేహ తెలుగు ప్రేక్షకులకు చివరగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ వదినగా స్నేహ నటించింది. అయితే, ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version