ట్రొలింగ్ రాయాళ్లు అందుకే దాడి చేస్తారు..!!

ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతుకుతున్న సోషల్ మీడియా ప్రపంచంలో ట్రోలింగ్ అనేది సాదారణ విషయంగా మారింది. దీనికి రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, బాబాలు అనే తేడా లేకుండా పోయింది. ట్రొలింగ్ రాయాళ్లు వదిలే ప్రసక్తే లేకుండా వుంది. ఇది మనుషుల్లో వచ్చిన ప్రవర్తన లో మార్పా అనేది అర్థం కాకుండా వుంది.

తాజాగా అసలు ట్రోలింగ్ ఎందుకు జరుగుతోంది అనే విషయాల మీద ప్రముఖ  దర్శకుడు..నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తనదైన శైలిలో కామెంట్స్ చేసారు. ఒకప్పుడు సెలబ్రిటీలు సినిమా వార్తలు కోసం మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారు. కాని ప్రస్తుతం తుమ్మినా, దగ్గినా, బాత్ రూం నుండి బెడ్ రూం వరకు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఇప్పుడు కంపెనీ లు ఇచ్చే ప్రమోషన్ డబ్భులు కోసం హాట్ హాట్ ఫోటోలు పెడుతున్నారు. దాచుకోవల్సిన విషయాలు కూడా పబ్లిక్ లో పెడుతున్నారు. దానితో వారు ట్రోలింగుకి గురవుతూ ఉంటారు. ఇక హనీమూన్ ట్రిప్ గురించి, బీచ్ ఎంజాయ్ మెంట్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. అందుకే అలాంటి వాళ్లే ట్రోలర్స్ కు దొరుకుతారని , దేనికైనా అతి ఉండొద్దు అని చెప్పుకొచ్చారు.