బిగ్ బాస్: వాసంతి కృష్ణన్ పారితోషకం ఎంతో తెలుసా..?

-

వరల్డ్ బెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇతర భాషలలోనే కాదు తెలుగులో కూడా ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆరవ సీజన్లో భాగంగా 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వచ్చారు. కంటెస్టెంట్ల మధ్య హోరాహోరి టాస్కులు నిర్వహించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం నుంచి 11 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.. పదో వారంలో భాగంగా ఈ కార్యక్రమం నుంచి డబ్బులు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బాలాదిత్య, వాసంతి కృష్ణన్ ఎలిమినేట్ అవ్వడం గమనార్హం.

రేలంగిమామయ్యగా గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య ఎలిమినేట్ అవ్వడం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. మరొకవైపు గ్లామర్ క్వీన్ గా బిగ్ బాస్ లో మరింత పాపులారిటీ అందుకున్న వాసంతి కృష్ణన్ కూడా ఎలిమినేట్ అవ్వడం బాధాకరమని చెప్పాలి. ఇలా ఈ విధంగా బిగ్ బాస్ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ తో ఇద్దరు కంటెస్టెంట్లను బయటకు పంపించడంతో మిగతా హౌస్ మేట్స్ లో భయాందోళనలు కలుగుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు అని ప్రేక్షకుల మనసులకు కూడా తెలియకుండా బిగ్ బాస్ జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్లతో టైటిల్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి 10వ వారం బయటికి వచ్చిన వాసంతి 10 వారాల పాటు హౌస్ లో కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోని ఆమె ఎంత పారితోషకం తీసుకున్నారు అనే విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈమె ఒక్క వారానికి 25 వేల రూపాయల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇక 10 వారాలకు గాను 2.5 లక్షల రూపాయలకు పైగా పారితోషికం అందుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news