దేశం గర్వించే సాఫ్ట్ వేర్ దిగ్గజం ఫాకీర్ చాంద్ కోహ్లీ కన్నుమూత..

-

జాతి గర్వించే సాఫ్ట్ వేర్ దిగ్గజం ఫాకీర్ చాంద్ కోహ్లీ గురువారం కన్నుమూసారు. 96సంవత్సరాల వయసులో ఆయన పరమపదించారు. ఫాదర్ ఆఫ్ ద ఐటీ ఇండస్ట్రీగా పిలవబడే కోహ్లీ గారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ని స్థాపించారు. దేశంలోని మొట్టమొదటి అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీగా సీఈవోగా పనిచేసారు. ఆయన మార్గదర్శకత్వంలో సాఫ్ట్ వేర్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సాఫ్ట్ వేర్ రంగంలో భారతదేశాన్ని అగ్ర భాగాన నిలిపేందుకు ఎంతగానో కృషి చేసారు.

ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగం ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. దేశంలో అత్యంత పాపులర్ ఉన్న ఉద్యోగాలన్నీ సాఫ్ట్ వేర్ రంగంలోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ క్రెడిట్ అంతా మనదేశంలో సాఫ్ట్ వేర్ రంగాన్ని అగ్రభాగన నిలిపేందుకు కృషి చేసిన ఫారీక్ చాంద్ కోహ్లీ గారికే దక్కుతుంది. 1924లో పెషావర్ లో జన్మించిన కోహ్లీ గారు అక్కడే చదువు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత 1968లో టీసీఎస్ మొదలైంది. ఆ కంపెనీకి మొదటి సీఈవోగా కోహ్లీగారు నియమితులయారు.

Read more RELATED
Recommended to you

Latest news